ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Dasabdhi - 10th Anniversary Celebrations

A golden moment.

ఒక రోజు facebook చూస్తుండగా, అశ్వ దశమ వార్షికోత్సవం సందర్భంగా "కధ,కవిత,వాస్తవిక సంఘటన"ఈ మూడు విభాగాల్లో పోటీ అన్న ఒక ప్రకటన కనపడింది.aswa గురించి చూస్తే దాని వ్యవస్థాపకులు,సేవకు స్నేహితుడు అయిన శ్రీనివాస్ గారి గురించి మీడియాలో వచ్చిన కధనాలు ,ఆయన ఆశయాలు గురించి తెలిసింది.

ఆదిశంకరులు ఎప్పుడో అన్నట్లు"చెడ్డ పుత్రులు ఉంటారేమో కానీ చెడ్డ  తల్లులు మాత్రం ఈ లోకంలో ఉండరు" అటువంటి అమ్మ గొప్పతనాన్ని వివరిస్తూ శ్రీమతి భారతి రాసిన " అమ్మ "

మరియు వాస్తవ సంఘటన క్రింద నేను రాసిన "గురుకులం-భూపతిపాలెం శ్రీమంతులు-నా పాత్ర"  ఇవి పోటీకి పంపగా అవి వారి "అశ్వ దశాబ్ది" లో ప్రచురణకి అర్హత సాధించాయి.

జూన్ 10 ఆదివారం సాయంత్రం హైద్రాబాద్  అశ్వ దశాబ్ది వార్షికోత్సవం జరుగుతున్న అమీర్ పేట్ సెస్ ఆడిటోరియానికి చేరుకున్న మమ్మల్ని శ్రీనివాస్ గారు,హరిత గారు సాదరంగా లోపలికి ఆహ్వానించారు. నిస్వార్థంగా సమాజసేవ లో ఉన్న శ్రీనివాస్ గారిని చూద్దామని వెళితే, ఆయన బాటలో నడుస్తూ  ఆయన లాంటి అనేకమంది అశ్వ వాలంటీర్లు అక్కడ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండడం ఆశ్చర్యం కలిగించింది.

నిస్వార్థంగా, నిర్మలమైన మనస్సులతో,స్వచ్ఛమైన సమాజ సేవకు అంకితమైన అశ్వ వాలంటీర్లు తో నిండిన ఆ ప్రాంగణం దేవాలయ ప్రశాంతత ను గుర్తుకు తెచ్చి మా మనసుకు హాయినిచ్చింది.దీనికి తోడు అచ్చ తెలుగులో భావయుక్తం గా కొనసాగుతున్న భావరాజు పద్మిని గారి వ్యాఖ్యానం మరింత శోభనిచ్చింది. సమాజంలోని మంచి చెడులు గురించి ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటూ సాగిన అశ్వ వాలంటీర్ల సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.వేదిక మీద విశిష్ట వ్యక్తుల ఉత్తేజకరమైన ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా ఉండడంతో పాటు ఉత్సాహాన్నిచ్చాయి.

 10 సంవత్సరాలు అశ్వ తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్ల కి విశిష్టమైన బిరుదులు, స్ఫూర్తిదాయకంగా  జ్ఞాపిక లు అందజేస్తూ,సంస్థ కి అన్ని రకాలుగా సహాయంగా  ఉన్నవారికి సత్కారాలు చేస్తూన్న సమయంలో అనూహ్యంగా  వేదిక మీదకి మమ్మల్ని ఆహ్వానించి ముఖ్య అతిధుల చే  మమ్మల్ని సన్మానించిన క్షణం మా జీవితంలో మహత్తరమైన మధురమైన క్షణం. ఈ అవకాశం మాకు కల్పించిన అశ్వ సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు. SSSSV Lakshman, Kakinada

0 comments:

Post a Comment

Add your comments here

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best Web Hosting