*మనం పుట్టినప్పటి నుంచి ఈ సమాజం మనకు ఎన్నో అందించింది. మనం నేరుగా సమాజానికి తిరిగి ఏమీ అందించలేకపోయినా, సంఘసేవలో పాల్గొనక పోయినా, కనీసం సహృదయంతో, పరిపూర్ణ సేవాభావంతో పనిచేసే ఇటువంటి యువతను ప్రోత్సహించి, ముందుకు నడపడం మనందరి బాధ్యత. అందుకే మీకు ఏ మాత్రం వీలున్నా, వీరు చేప్పట్టిన కార్యక్రమాల్లో పాల్గొని, వీరికి ఉత్సాహం కలిగిస్తారు కదూ!*
*అసలు సరిగ్గా పదేళ్ళ క్రితం ఏమైందంటే...*
సంఘ సేవ చెయ్యాలన్న బలమైన కోరిక ఉన్న ఒక 16 మంది యువ సహోద్యోగులు ఒక అనాధాశ్రమాన్ని దర్శించి, ఒకరోజంతా గడిపినప్పుడు... వారు జీవితంలో ఎన్నడూ పొందనంత తృప్తిని సొంతం చేసుకున్న భావన వారికి కలిగింది. *'ఈ ఆనందాన్ని మనం ఎందుకు శాశ్వతం చేసుకోకూడదు'* అన్న ఆలోచనతో వారంతా కలిసి *'అమ్మ స్వచ్చంద సేవా సంస్థ (ASWA)* ను స్థాపించారు. ఇప్పుడు ఆ సంస్థ స్వచ్చంద సేవకుల సంఖ్య 500 పైచిలుకు.
ఇప్పటి దాకా వీరు ఈ సంస్థ తరఫున పలు *రక్తదాన శిబిరాలు, పాఠశాల పిల్లలకు వ్యక్తిత్వ వికాస తరగతులు , విద్యపై అవగాహన కార్యక్రమాలు, వృద్ధుల, అనాధలకు అండగా ఉండే షేర్ అండ్ కేర్ వంటి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు,* వంటివి ఎన్నో నిర్వహించారు. వీరి ఫేస్బుక్ పేజి ని క్రింది లింక్ లో దర్శించవచ్చు.
https://www.facebook.com/AMMAASWA/
*నెలకొక్క గంట సమయం* మీరు సంఘ సేవకి కేటాయించగలరా? లేక *నెలకొక్క వంద రూపాయిలు* ఈ కుర్రాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించగలరా ? పోనీ *అసలేమీ వద్దండి...కాసేపు వెళ్లి వాళ్లకు ఉత్సాహం కలిగేలా భుజం తట్టి ప్రోత్సహించి, రాగలరా?*
వాట్సాప్ : 9948885111 / 9949789229