ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Thursday, June 18, 2020

Educational Support to Nunavat.Lavanya, Husnabad for her Diploma and BE


Update up to 18.06.2020
 
Rs. 8,400/-  has been paid to Nunanvath Lavanya, BE towards her 2 months hostel /mess fees from Feb to March 2020 along with 1000/- per month additional expenses charged by hostel as baggage fee.

Wednesday, June 17, 2020

Capacity Building Session Glimpses

They are not just Volunteering...

They are also enjoying the joyful learning.

Being a Volunteer itself is a great opportunity to grow yourself in all facets of like i.e. Professional, Personal, and Spiritual.

As a Volunteer, you are not GIVING, instead, YOU ARE getting many benefits...

BE A VOLUNTEER by Spending 1 Hour in a Month www.aswa4u.org or 99 4888 5111Amma Sreenivas

కార్యక్రమాల వెనక దాగివున్న కార్యకర్తల కష్టం, సమయం, శ్రమ గురించి 2 మాటలు...

ఒక వీడియో చేయాలన్న, ఒక బ్రోచర్ చేయాలన్న, ఒక ఆక్టివిటీ చేయాలన్న ఎంత సమయం కేటాయించాలో తెలిస్తే మీకు ఒక అవగాహన ఉంటుంది... అందులో డబ్బులు ఖర్చు చెయ్యకుండా వాలంటీర్ గా చేసే పనులకు ఇంకా ఎక్కువ శ్రమ, సమయం కావాలి. అయినను అన్ని పనులు కూడా ఇలా 1 గంట వాలంటీర్ గా కేటాయించాలని వచ్చి సమాజం మీద ప్రేమతో ఎక్కువ సమయం ఇస్తున్న కార్యకర్తలతోనే చేస్తున్నాము...

ఉదాహరణ నిన్న సినిమా వారితో చేసిన బ్లడ్ డొనేషన్ వీడియోనే తీసుకుందాం... దీని కోసం పద్మిని అక్క, శ్రీకాంత్ వారందరికీ మెసేజ్ లు పెట్టి, వారి దగ్గర కలెక్ట చేసి, మనకి పంపి, మహేష్, నేను గైడ్ చేస్తే పాపం సతీష్ 3,4 సార్లు వీడియోస్ ని జాయింట్ చేసి, ఎడిట్ చేసి, అప్లోడ్ చెయ్యడానికి అందరిది కలసి కనీసం 10 నుంచి 15 గంటలు పడుతుంది. Blood Poster చేయడానికి ఫొటోస్ కలెక్ట్ చెయ్యడం, డిజైన్ అన్ని కలిపి ఇద్దరు వాలంటీర్స్ కి కనీసం 2 గంటలు పడుతుంది. ఎందుకంటే మనం నిపుణులం కాదు కదా.. ఎదో మనకి వచ్చిన దానికి మరి కొంత నేర్చుకుంటూ ఇలాంటివి చేస్తుంటారు వాలంటీర్స్..

ఇదంతా ఎందుకోసం చేస్తున్నామో మీకు చెప్పనక్కరలేదుగా... మంచి పనులు చెయ్యడంతో పాటు, చేస్తున్నవి చెప్పడం కూడా ముఖ్యమే... ఎందుకంటే అలా చెయ్యాలి అనుకున్నవారు ఇలాంటి సమాచారం కోసం ఎదురుచూస్తుంటారు.....ఈ సమాచారం వారిని చేరాలంటే మిమ్మల్ని దాటాలి కదా... దాటాలంటే మీరు నలుగురికి పంపాలి కదా...

కనీసం కొంతమంది లో అయినా అవగాహన, ప్రేరణ కలిగి రక్తదానం చేస్తారని, తలసీమియా గురించి తెలుసుకొంటారని, స్కూల్ పిల్లలకి పాటలు చెప్తారని... ఇలా మనం చేస్తున్న వివిధ రకాల సేవా కార్యక్రమాలలో మనతో పాటు సమాజ సేవ చేయడానికి చేయి కలుపుతారని...

మంచి విషయాలను చూడడానికి సమయం లేని ప్రస్తుత పరిస్థితులలో, మంచిని పంచే కనీస ప్రయత్నం కూడా మనమే చెయ్యాలి, చెయ్యమని కూడా చెప్పాలి.... చేయకపోతే ఎలా.

మనకు సమయం లేదా... లేక సమయం ఇవ్వవడానికి... మనస్కరించడం లేదా? ఆలోచించండి అని మన 7వ వార్షికోత్సవంలో తనికెళ్ళ భరణి గారి మాటలు గుర్తొచ్చాయి...

ఇది అశ్వలో సభ్యులు అనుకున్నవారికి నేను చేసుకుంటున్న విజ్ఞప్తి.... మనందరం ఇలా సమయం ఇచ్చి సమాజం కోసం ఎదో చెయ్యాలి అనే ఒక తపనతో పని చేస్తున్న, లేదా చెయ్యాలనే భావం ఉన్న వాళ్ళమే కదా... మనమే మన, మన తోటి కార్యకర్తల పనిని, ఇస్తున్న సమయాన్ని గుర్తించక, నలుగురికి షేర్ చెయ్యకపోతే, చెప్పకపోతే... ఇంకెవరు చేస్తారు, చెప్తారు?. 

కార్యకర్తలు పడుతున్న కష్టానికి మనం చేసే చిన్న సాయం ఇది.. అలా చేసే సమయం మనకి ఉందా లేదా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి

అందరిని ప్రేమించు - అందరిని సేవించు

మీ అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org
Fb.com/ammaaswa

RECEIPTS for Donations to ASWA (Including CHDHC) Info required from DONORS


అశ్వ బాంక్ స్టేట్మెంటులో దాతల పేరు వివరాలు ఉండడం లేదు

1. చాలా సందర్భాలలో మీ అక్కౌంట్ నెంబర్ లేదా ట్రాన్సక్షన్ నెంబర్ లేదా మీ పేరు/ఇంటి పేరులో కొన్ని అక్షరాలు మాత్రమే కనపడతాయి. దీనిని బట్టి దాతల వివరాలు కనుక్కోవడం కష్టం.

కాబట్టి డొనేట్ చేయగానే, విధిగా  ఈ లింక్ లో మీ వివరాలు నింపండి.


(You can enter old data of 2019/2020 donations also)

2. చాలా తక్కువ సందర్భాలలో ఫోన్ నెంబర్ ఉంటోంది. వారికి ఫోన్ చేసి వారి వివరాలు కనుక్కొంటున్నాము.

3.అందుకని అలా వివరాలు తెలియని వారి విరాళాలను other donations received అనే ఖాతా / పేరుతో రసీదు రాయడం జరుగుతుంది. 

ఎందుకంటే పారదర్శకత, నమ్మకం అనే పునాదుల మీద అశ్వ నిర్మించడింది. మాకు వచ్చే లేదా ఖర్చు పెట్టె ప్రతి పైసా కి లెక్క రాయడం మా బాధ్యత

4. Bank వారు కూడా మేము ఇవ్వగలిగిన సమాచారం అంతే అన్నారు.

కావున దయచేసి సహకరించండి. డొనేట్ చేయగానే పై లింక్ లో మీ వివరాలు నింపండి

అందరిని ప్రేమించు - అందరిని సేవించు
www.aswa4u.org
Fb.com/ammaaswa
Info@aswa4u.org

Article in New Indian Express - Edex on 14.06.2020FULL ARTICLE in NEW INDIAN EXPRESS