ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Monday, June 25, 2018

29th Blood Donation Camp by ASWA

*ఈ రోజు (13.05.2018)  శ్రీనివాస నగర్ (వెస్ట్) కమ్యూనిటీ హాల్, SR నగర్ నందు 29వ రక్త దాన శిబిరం  నిర్వహించారు.  ఇందులో 200 మంది పాల్గొనగా, 125  మంది స్వచందంగా  రక్త దానం చేసారు* 40 మందికి పైగా అశ్వ కార్యకర్తలు తమ కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. 

ఈ కార్యక్రమానికి రక్తదానం లో విశేష సేవ చేస్తున్న బంటి, దీప, కృష్ణ రెడ్డి పాల్గొన్నారు. తలసీమియా సికిల్ సెల్ సొసైటీ కార్యదర్శి శ్రీ అలీం బైగ్ మాట్లాడుతూ తలసీమియా పిల్లల కోసం అమ్మ స్వచ్చంద సేవా సమితి (అశ్వ) వారు గత 7 సంవత్సరాలుగా చేస్తున్న కృషి స్లాఘనీయమన్నారు. ప్రతి 3 నెలలకు ఒక సారి రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ఇప్పటిదాకా 29 కాంప్ లు నిర్వహించిన మొదటి సంస్థ అశ్వా నే అని కొనియాడారు.

పాల్గొన్న అందరూ మన సేవా కార్యక్రమాలను కొనియడడమే కాకుండా, తమ వంతు  సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేశారు.

ఒక చిన్న ఆలోచనగా 2011 లో మొదలైన ఈ రక్త దాన శిబరాల నిర్వహణ ఈ రోజు నిర్విగ్నంగా 29 శిబరాలు చేరుకోవడం చాలా ఆనందంగా తృప్తిగా వుందని సంస్థ వ్యవస్తాపకుడు శ్రీనివాస్ తెలిపారు. 

"ఈ రోజు " వీటిలో "సేవ్ లైఫ్" (SAVE  LIFE) అనే ప్రాజెక్ట్ లో ముక్యంగా తలసీమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం ASWA రక్త దాన శిబిరాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం చెస్తున్నరు. ఇప్పటిదాకా 29 రక్త దాన శిబిరాలను నిర్వహించగా,   కొన్ని వేల మంది రక్త దాతలు స్వచ్చందంగా పాల్గొని ఎంతో మంది చిన్నారులను ఆదుకున్నారు. థలాసెమియా వ్యాధిగల పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించలి ఇందులో బాగంగా ప్రతి ఒక్కరు స్వచందంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్త దానం చెయ్యాలని అయన తెలిపరు. ఎవరైనా, ఎక్కడైనా రక్త దానం చెయ్యాలను, వారి కాలనీ /అపార్ట్ మెంట్/ఆఫీసు/హాస్టల్ లలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయ్యలనుకొంటే 9666526698/9948885111/www.aswa.co.in సంప్రదించాలని విన్నమించారు.


*అనిల్. చింతల*

సేవ్ లైఫ్ ప్రాజెక్ట్ టీం లీడర్

అమ్మ స్వచ్చంద సేవా సమితి

www.aswa.co.in

9948885111