ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Monday, June 21, 2021

Humanitarian Kit

 *అమ్మ స్వచ్ఛంద సేవా సమితి (Amma Social Welfare Association), Project Management Institute Pearl City Chapter , Hyderabad సంయుక్త ఆధ్వర్యంలో 19th June 2021 నాడు ఫిలిం నగర్ లోని 14 పేద కుటుంబాలకు భరోసా కిట్ ల  పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో PMI చాప్టర్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి గారు, కోవిడ్ టాస్క్ ఫోర్సు లీడ్ సౌజన్య గారు, వాలంటీర్ బాల సుబ్రహ్మణ్యం అలాగే ఆశ్వ సంస్థ కార్యకర్తలు నాగ లక్ష్మి , నవీన్ కుమార్ లు పాల్గొన్నారు.*


రోజు వారీ కూలీ ద్వారా జీవనం సాగించే వీరికి, కోవిడ్ లాక్ డౌన్ లో జీవనం మరింత కష్టతరమైంది. వీరిని ఆదుకోవడం కోసం *ASWA, PMI సంస్థలు ఒక్కొకరికి 1500/- విలువగలిగిన 25 కేజీ ల బియ్యం బస్తా తో పాటు, కందిపప్పు, నూనె, చక్కర, పచ్చడి, పసుపు, ఉప్పు, వేరుశనగ లాంటి నిత్యావసర వస్తువులు కలిగిన (హ్యూమానిటేరియన్) భారోసా కిట్ లను పంపిణీ చేసారు*


ఇప్పటిదాకా అశ్వ సంస్థ వారు ఇప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలలో *3,00,000/- విలువ గల దాదాపు 200 కిట్లను ఈ మూడు నెలలో* కరోనా మొదలైనప్పటినుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందిపడుతున్న కుటుంబాలకు పంపిణీ చేసి, చేయూత ఇస్తున్న విషయమే మీకు విదితమే...




#aswacovidrelief

#ammaaswa



Team ASWA

www.aswa4u.org

Fb.com/ammaaswa

9948885111

Sunday, June 06, 2021

Humanitarian Kit distribution

 *జూన్ 5 వ తేదీ మార్కాపురం (ప్రకాశం జిల్లా) లో 20 నిరుపేద కుటుంబాలకు భరోసా కిట్ లను మార్కాపురం మునిసిపల్ చైర్మన్ శ్రీ బాల మురళి కృష్ణ గారి పంపిణీ చేశారు. దీనికి రామడుగు వెంకటేష్ గారు, రామడుగు రమేష్ గారు, వీరా రావు గారు, కిణిజేటి కేశవరావు గారు, పి. శివ గారు, కృష్ణ గారు, శ్యాం గారు వస్తు రూపేణా, డబ్బు రూపేణా సాయం అందించారు. ఈ కార్యక్రమం మొత్తం సజావుగా సాగడానికి శ్రీ నటుకుల శ్రీనివాస రావు గారు ఎంతో సాయసహకారాలను అందించారు.* 

*aswa4u.org సహకారంతో బిటెక్ చదువుతున్న జగదీష్* వారి పరిసరాల్లో ఉన్న నిరుపేదలను గుర్తించడం, శ్రీనివాస్ రావు గారి సహకారంతో దాతలను కలసి సరుకులను సేకరించడం, పంపిణీ సజావుగా జరిగేట్టు చెయ్యడం ద్వారా ఒక మంచి అనుభవాన్ని, అనుభూతిని పొందారు. తన నిబద్ధత ఎంతో హర్షించదగ్గది. 

*మా సంస్థ కార్యక్రమాల గురించి సమాచారం పొందాలనుకుంటే 9948885111 కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి.*



#ammaaswa

#aswacovidrelief

Team ASWA

www.aswa4u.org

Fb.com/ammaaswa

9948885111