ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Wednesday, June 29, 2011

About BOSF in today's Andhra Jyothi-Navya Edition - మాతో కలవండి..సాయం చేయండి!

మాతో కలవండి..సాయం చేయండి!

మనకి చేతనైన పని చేయడానికి ఎవరి సాయం అక్కర్లేదు. కాని చేయాలని ఉండి...చేయలేని స్థితిలో ఉంటే తప్పనిసరిగా తోటివారిని ఆశ్రయించాలి. కాని సాయం చేయగలిగేవారు ఎక్కడున్నారో ఎలా తెలుసుకోవాలి? నిమిషాల్లో వారికి విషయం ఎలా తెలియపరచాలి? తెలియని విషయం గురించైనా ఇంటర్నెట్ చెబుతుంది. అలాగే మనకి తెలియని మనిషినైనా ఇంటర్నెట్ కలుపుతుంది. అందుకే సాయం చేసేవారిని కలుసుకోడానికి ఇంటర్నెట్ని వేదిక చేసుకున్నారు యువతీ యువకులు. వేదిక పేరే 'బర్డ్ ్స ఆఫ్ సేమ్ ఫెదర్స్'

ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ మరో పక్క సాయం కోసం ఎదురుచూస్తున్న పేదలకు తోడుగా నిలిచే పనిలో ఉన్న పదిమంది యువతకి వచ్చిన ఆలోచనే 'బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్'. 2005 సంవత్సరంలో ప్రశాంతి అనే యువతి ఆధ్వర్యంలో 'టు మేక్ డిఫరెన్స్' అనే బృందం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. అనాథల్ని చేరదీయడం, పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉచితంగా వైద్యం ఇప్పించడం...ఇలా రకరకాల కార్యక్రమాలు చేసే బృందానికి ఒకసారి పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. వారి స్థోమతకి మించిన సాయం చేయాల్సివచ్చింది. దాంతో తమలా పనిచేసే స్వచ్ఛంద బృందాలను ఆశ్రయించింది. అందులో రెండు బృందాలు స్పందించి సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇలాంటి రెండు మూడు అనుభవాలు ఎదురయ్యాక 'టు మేక్ డిఫరెన్స్' బృందం వ్యవస్థాపకురాలు ప్రశాంతి మదిలో ఒక ఆలోచన వచ్చింది.
సాయం చేసే గుమ్మం...
హైదరాబాద్లో ఇలాంటి బృందాలు దాదాపు నలభై వరకూ ఉన్నాయి. అవి రకరకాల సేవాకార్యక్రమాలు చేస్తున్నాయి. ఎవరి దృష్టికి వచ్చిన సమస్యలు వారు పరిష్కరిస్తున్నారు. పరిష్కరించలేని సమస్యలొస్తే పక్క బృందాలకు అప్పగిస్తున్నారు. అయితే ఇలా అప్పగించడం అనేది అంత సులువైన పనికాదు. "మనం పెట్టలేనపుడు పెట్టే గుమ్మం చూపించమన్నారు పెద్దలు. ఒక్కొక్కసారి ఇలాంటి సహాయాలు చాలా చేయాల్సి వస్తుంది. మధ్య మలక్పేట నుంచి ఒక ఫోన్కాల్ వచ్చింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కూతుర్ని కాపాడుకునేందుకు తల్లి చాలా రకాలుగా ప్రయత్నించింది. డాక్టర్ల సాయంతో అమ్మాయి జబ్బుని చాలావరకూ నయం చేసింది. కాని అమ్మాయికి ఒక ఆపరేషన్ చేయించాలి. నాలుగు లక్షల రూపాయల వరకూ డబ్బు అవసరం అని చెప్పింది.
అంత డబ్బు మేము వెంటనే సమకూర్చలేం. సమయంలో రెండు మూడు బృందాల వారికి విషయాన్ని చెప్పాం. బృందాల్లో సభ్యులుగా ఉన్న ఒక డాక్టరు అమ్మాయికి బెంగుళూరులోని ఒక ఆసుపత్రిలో ఆపరేషన్కి ఏర్పాట్లు చేయించారు. నాలుగు లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ని రెండు లక్షలకే చేయడానికి అక్కడి వైద్యుల్ని ఒప్పించారు. రెండు లక్షలూ కూడా పలు ప్రాంతాల్లో ఉండే నాలుగు బృందాల సభ్యులు ఇచ్చారు. పనంతా మేము రెండు రోజుల్లోనే చేసేశాం. ఎలా అంటే...'బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్'. అదే లేకపోతే... అమ్మాయికి ఆపరేషన్ చేయించడానికి నెలల సమయం పట్టేదేమో'' అని బి..ఎస్.ఎఫ్. ప్రత్యేకత చెప్పారు ప్రశాంతి.
ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ మరో పక్క సాయం కోసం ఎదురుచూస్తున్న పేదలకు తోడుగా నిలిచే పనిలో ఉన్న పదిమంది యువతకి వచ్చిన ఆలోచనే 'బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్'. 2005 సంవత్సరంలో ప్రశాంతి అనే యువతి ఆధ్వర్యంలో 'టు మేక్ డిఫరెన్స్' అనే బృందం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. అనాథల్ని చేరదీయడం, పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉచితంగా వైద్యం ఇప్పించడం...ఇలా రకరకాల కార్యక్రమాలు చేసే బృందానికి ఒకసారి పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. వారి స్థోమతకి మించిన సాయం చేయాల్సివచ్చింది. దాంతో తమలా పనిచేసే స్వచ్ఛంద బృందాలను ఆశ్రయించింది. అందులో రెండు బృందాలు స్పందించి సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇలాంటి రెండు మూడు అనుభవాలు ఎదురయ్యాక 'టు మేక్ డిఫరెన్స్' బృందం వ్యవస్థాపకురాలు ప్రశాంతి మదిలో ఒక ఆలోచన వచ్చింది.

సాయం చేసే గుమ్మం...
హైదరాబాద్లో ఇలాంటి బృందాలు దాదాపు నలభై వరకూ ఉన్నాయి. అవి రకరకాల సేవాకార్యక్రమాలు చేస్తున్నాయి. ఎవరి దృష్టికి వచ్చిన సమస్యలు వారు పరిష్కరిస్తున్నారు. పరిష్కరించలేని సమస్యలొస్తే పక్క బృందాలకు అప్పగిస్తున్నారు. అయితే ఇలా అప్పగించడం అనేది అంత సులువైన పనికాదు. "మనం పెట్టలేనపుడు పెట్టే గుమ్మం చూపించమన్నారు పెద్దలు. ఒక్కొక్కసారి ఇలాంటి సహాయాలు చాలా చేయాల్సి వస్తుంది. మధ్య మలక్పేట నుంచి ఒక ఫోన్కాల్ వచ్చింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కూతుర్ని కాపాడుకునేందుకు తల్లి చాలా రకాలుగా ప్రయత్నించింది. డాక్టర్ల సాయంతో అమ్మాయి జబ్బుని చాలావరకూ నయం చేసింది. కాని అమ్మాయికి ఒక ఆపరేషన్ చేయించాలి. నాలుగు లక్షల రూపాయల వరకూ డబ్బు అవసరం అని చెప్పింది

అంత డబ్బు మేము వెంటనే సమకూర్చలేం. సమయంలో రెండు మూడు బృందాల వారికి విషయాన్ని చెప్పాం. బృందాల్లో సభ్యులుగా ఉన్న ఒక డాక్టరు అమ్మాయికి బెంగుళూరులోని ఒక ఆసుపత్రిలో ఆపరేషన్కి ఏర్పాట్లు చేయించారు. నాలుగు లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ని రెండు లక్షలకే చేయడానికి అక్కడి వైద్యుల్ని ఒప్పించారు. రెండు లక్షలూ కూడా పలు ప్రాంతాల్లో ఉండే నాలుగు బృందాల సభ్యులు ఇచ్చారు. పనంతా మేము రెండు రోజుల్లోనే చేసేశాం. ఎలా అంటే...'బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్'. అదే లేకపోతే... అమ్మాయికి ఆపరేషన్ చేయించడానికి నెలల సమయం పట్టేదేమో'' అని బి..ఎస్.ఎఫ్. ప్రత్యేకత చెప్పారు ప్రశాంతి.

ఎలా పనిచేస్తోంది...
నలభై బృందాలవారు తాము పరిష్కరించలేని సమస్యలు వస్తే బి..ఎస్.ఎఫ్.లో మెయిల్ పెడతారు. వెంటనే అందరికీ సమాచారం వెళ్లిపోతుంది. కొత్తవారు కూడా ఇందులో తమ సమస్యల్ని చెప్పుకోవచ్చు. సమస్యను ఎవరు పరిష్కరించగలిగితే వారు ముందుకు వస్తారు. లేకపోతే చేయగలిగే వారికి తెలియపరుస్తారు. "ఆన్లైన్ ఫ్లాట్ఫాం పెట్టాక ఇలా ఎన్నో సమస్యలు పరిష్కరించగలిగాం. సేవ ఒక్కటే కాదు... బిఒఎస్ఎఫ్ ద్వారా సామాజిక సంబంధాలు కూడా పెరుగుతాయి. ప్రతీ నెల మొదటి ఆదివారం ఒక సమావేశం పెట్టుకుంటాం. అప్పుడప్పుడు కలిసి కొత్తగా చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి చర్చించుకుంటాం. మొత్తానికి బిఒఎస్ఎఫ్ ద్వారా తోటివారికి సాయం చేయాలన్న ఆలోచన వచ్చిన వారందరం ఒకే గూటి పక్షులమయ్యాం'' అని చెప్పారు ప్రశాంతి. ఆసక్తి ఉన్న వారు తమతో చేతులు కలిపితే మరికొన్ని జీవితాలకు ఆసరా దొరుకుతుందన్నారామె.

https://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2011/jun/29/navya/29navya1&more=2011/jun/29/navya/navyamain&date=6/29/2011

Love all-Serve all
AMMA Srinivas
పరోపకారాయ ఫలంతి వృక్షాః! పరోపకారాయ వహంతి నద్యాః! పరోపకారాయ చరంతి గావః! పరోపకారార్థ మిదం శరీరం!!
This body is to serve the needy, as how the Trees, Rivers and Cows do...