ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Wednesday, January 29, 2020

Career Guidance Sessions in Tappetlamersu Village, Gattu Mandal

*అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ {అశ్వ}* ఆధ్వర్యంలో
*పది విద్యార్థుల కు కెరియర్ గైడెన్స్ పుస్తకాలు పంపిణీ*


 *అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ {అశ్వ} స్వచ్చంధ సంస్థ* ఆధ్వర్యంలో గట్టు మండల పరిధిలోని *అరగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి విద్యార్థులకు ఉచితంగా *కెరియర్ గైడెన్స్ బుక్ లెట్* లను *అశ్వ సంస్థ వాలంటీర్,మొటివేషనల్ స్పీకర్ *ఉరుకుందు శెట్టి* పంపిణీ చేశారు.పదోవ తరగతి తరువాత విద్యార్థులు ఏ విధమైన కెరియర్ ఎంచుకోవాలి,ఏ ఏ అవకాశాల ఉన్నాయో వాటి వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు అని వివరించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యం తో ముందుకు సాగాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం *జహీర్ బేగ్,ఉపాధ్యాయులు రాజు,శ్రీరాములు,రమేష్ నాయక్,విజయ్ కుమార్,శివనీల, చంద్రకళ,అంబికా మరియు విద్యార్థులు పాల్గొన్నారు...*