ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Sunday, December 29, 2019

Career Guidance Sessions in Tappetlamersu Village, Gattu Mandal

అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ {అశ్వ} ఆధ్వర్యంలో పది విద్యార్థుల కు కెరియర్ గైడెన్స్ పుస్తకాలు పంపిణీ

 అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ {అశ్వ} స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో  గట్టు మండల పరిధిలోని,తప్పెట్లమొర్సు ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి విద్యార్థులకు ఉచితంగా కెరియర్ గైడెన్స్ బుక్ లెట్ లను అశ్వ సంస్థ వాలంటీర్,మొటివేషనల్ స్పీకర్ *ఉరుకుందు శెట్టి పంపిణీ చేశారు.పదోవ తరగతి తరువాత విద్యార్థులు ఏ విధమైన కెరియర్ ఎంచుకోవాలి,ఏ ఏ అవకాశాల ఉన్నాయో వాటి వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు అని వివరించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యం తో ముందుకు సాగాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం చంద్రశేఖర్, శేఖర్ బాబు,ఉపాధ్యాయులు, వాలంటీర్లు,విద్యార్థులు పాల్గొన్నారు