ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Tuesday, December 17, 2019

35th Blood Donation Camp on 15.12.2019

*35th Blood Donation Camp Updates*

15.12.2019 శ్రీనివాస నగర్ (వెస్ట్) కమ్యూనిటీ హాల్, SR నగర్ నందు అమ్మ స్వచ్చందసేవా సమితి 35వ రక్త దానశిబిరం నిర్వహించారు.  ఇందులో 120 మందికి పైగా పాల్గొనగా, 70 మంది స్వచందంగా రక్త దానం చేసారు* 30 మందికి పైగా అశ్వ కార్యకర్తలు తమ కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. 

*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీమతి ఉమారాణి పద్మనాభన్, సోషల్ వర్కర్  కాంప్ ప్రారంభోత్సవం చెయ్యడమే కాక, 2K వాక్ ఓపెన్ చేసి చుట్టుపక్కల వారిలో రక్తదానం, థలసెమియా గురించి అవగాహనను కలుగ చేసారు. అలాగే  రక్తదానం లోనే కాకుండా, విద్యార్థులకు తరగతులు, అన్నదానాలు లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తు, విశేష సేవ చేస్తున్న  అశ్వని, వారి కార్యకర్తలను కొనియాడారు. అందరు నెలకు 1 గంట సమయాన్ని ఇచ్చి సంస్థకు తోడ్పాటు ఇవ్వాలని కోరారు*. పాల్గొన్న అందరూ మన సేవా కార్యక్రమాలను కొనియడడమే కాకుండా, తమ వంతు  సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేశారు.

ఒక చిన్న ఆలోచనగా 2011 లో మొదలైన ఈ రక్త దాన శిబరాల నిర్వహణ ఈ రోజు నిర్విగ్నంగా 35 శిబరాలు చేరుకోవడం చాలా ఆనందంగా తృప్తిగా వుందని *"సేవ్ లైఫ్ టీం సభ్యులు లక్ష్మి, బాలు మహేంద్ర, చలపతి, సాహితి, సతీష్, ఫణి, గణేష్, మునీర్, శివ, అనిల్ తెలిపారు."*

"ఈ రోజు " వీటిలో "సేవ్ లైఫ్" (SAVE  LIFE) అనే ప్రాజెక్ట్ లో ముక్యంగా తలసీమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం ASWA రక్త దాన శిబిరాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం చెస్తున్నరు.

థలాసెమియా వ్యాధిగల పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించలి ఇందులో బాగంగా ప్రతి ఒక్కరు స్వచందంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్త దానం చెయ్యాలని అయన తెలిపరు. ఎవరైనా, ఎక్కడైనా రక్త దానం చెయ్యాలను, వారి కాలనీ /అపార్ట్ మెంట్/ఆఫీసు/హాస్టల్ లలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయ్యలనుకొంటే 9948885111 / www.aswa4u.org సంప్రదించాలని విన్నమించారు.









Team Save Life
www.aswa4u.org
www.aswa.co.in
Fb.com/ammaaswa