నమస్తే...
17 నవంబర్ ఆదివారం నాడు అమ్మ స్వచ్చంద సేవా సమితి (అశ్వ) కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ సంస్థ కు మూల స్తంబాలుగా ఉన్న వారికోసం (వారి కుటుంబాలతో కలిపి) మిసమ్మగూడా లోని గుడి దగ్గర "వనభోజనాలను" ఏర్పాటు చేసింది, ఇందులో పెద్దలు, పిల్లలు అందరూ కలిసి 52 మంది దాకా పాల్గొన్నారు. అయిన ఖర్చులను ఎప్పటిలానే అందరూ సమానంగా పంచుకున్నారు.
ఈ సారి, మనమే అక్కడికి వెళ్లి బృందాలుగా విడిపోయి వంటలు వండుకొని తినడం, ఆటలు, పాటలు మొదలైన అన్ని కార్యక్రమాలు ఎంతో కోలాహలంగా, చాలా సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా, సభ్యుల మధ్య బంధాలను దృఢతరం చేసాయి. సభ్యులందరు పనులను పంచుకొని పోటీ పడి చెయ్యడం చాలా అద్భుతం.
ఈ కార్యక్రమం కోసం ఒక మంచి స్థలాన్ని సూచించడమే కాకుండా, మాకు కావలిసిన సమస్తం ఏర్పాటు చేసిన మన ఆక్టివ్ వాలంటీర్ కృష్ణ ప్రసాద్ & కు టీం మొత్తం ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.
కిలారు శ్రీనివాస్ 30 కి పైగా మొక్కలు తెప్పించి ఇక్కడ నాటించడం అందరికి చాలా సంతృప్తిని ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
మీ అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org
www.aswa.co.in