ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Saturday, April 24, 2021

Children Learning Center (#CLCASWA) by ASWA Updates

 👩‍👩‍👧‍👧రాంనగర్ కాలనీలో ఉంగరాలు అమ్ముకునే కమ్యూనిటీ వారి పిల్లలు రాం నగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుకొనేవారు.  ఇదే స్కూల్ లో హరిత, Wipro Foundation సహకారంతో, భాషను సులువుగా, పిల్లల్లో ఆశక్తి కలిగించే విధంగా నేర్పడం పై దాదాపు 3 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్న విషయం మీకు విదితమే కదా.

🤝🍛 కరోనా కాలంలో అండగా

ఏప్రిల్ 2020 నుంచి ఈ కమ్యూనిటీ కి పలు సార్లు బియ్యం, సరుకులు: స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో  స్వేటర్లు, దుప్పట్లు, ఇంటి మీద కప్పుకొనే ప్లాస్టిక్ పట్టాలు: సత్యం-అశ్వ కలిసి 17 మంది పిల్లలకు సంక్రాంతికి కొత్తబట్టలు ఇవ్వడం లాంటివి మీకు తెలిసిందే.

🛩️🏹📘అలా మొదలైంది-CLC

పంపిణీ సమయంలో అటు ఆన్లైన్ క్లాసులుకు అటెండ్ కాలేక, ఇటు స్కూల్ లేకుండా పూర్తిగా చదువుకు దూరమైన చిన్నారులను గమనించిన అమ్మ స్వచ్ఛంద సేవా సమితి (www.aswa4u.org) వాలంటీర్స్ హరిత, శ్రీనివాస్ అశ్వ ద్వారా అక్టోబర్ 2020 లో  వారిలో కొంచెం చదువుకున్న అమ్మాయికి ప్రేరణ కలిగించి, వారికోసం ఒక టెంట్ వేసి, లెర్నింగ్ సెంటర్ మొదలుపెట్టి, ప్రతి రోజు రెండు గంటలు  వారికోసం వినూత్న పద్దతిలో (కథల ద్వారా, వారి పరిసరాల ద్వారా, వారి రోజు వారీ జీవిత అనుభావాల ద్వారా) భాష నేర్పే ప్రయత్నం చేస్తున్న విషయం మీకందరికి తెలిసిందే. 

👩‍🎓 పిల్లల్లో ఆశక్తిని, అభివృద్దిని అలాగే తల్లితండ్రుల బాధ్యతాయుతమైన ప్రవర్తనను  గుర్తించి, మేము ఇక్కడ  ఈ సెంటర్ లో ఫిబ్రవరి, 2021 నుంచి ఒక రిసోర్స్ పర్సన్ ను నియమించాము అక్కడ ఉన్న 16 మంది పిల్లలకు తోడు, ఒక నెల రోజుల నుంచి చుట్టుపక్కల నుంచి మరో 10-15 మంది పిల్లలు కూడా CLC కి వస్తున్నారు. మొత్తంగా CLC కి రోజు 25 మందికి పైగా పిల్లలు వస్తున్నారు.

💎👏 అసలు స్కూలుకి సరిగా వెళ్లకుండా మానేసిన మనోహర్ అనే పిల్లవాడు మన సెంటర్ కి రోజూ రావడమే కాకుండా, నేను కూడా మళ్ళీ స్కూల్ కి వెళ్తాను, నేర్చుకొంటాను అనే అశక్తిని కలుగచేసింది ఈ CLC. అలాగే గణేష్, గంగోత్రి తెలుగు చదవడం రాయడం నేర్చుకోవడం, మహేష్ కథలు బాగా చెప్పడం.. ఇలా అందరి పిల్లలలో అభివృద్దిని వాళ్ళ తల్లితండ్రులు గమనించి, మాకు చెప్పడమే కాకుండా, అక్కడ కావాల్సినవి చొరవ తీసుకొని అడగడం, సెంటర్ సక్రమంగా జరిగేట్టు చూడడం అనే భాధ్యత తీసుకొన్నారు. రోజూ రిసోర్స్ వెళ్తున్నా, మేము అప్పుడప్పుడు వెళ్తున్నా సరే వాళ్లే  మాకు రోజు ఫోన్ చేసి ఏమి జరిగిందో సమాచారం ఇస్తారు. 

☂️🏠✍️ తరువాత ఏంటి?

ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉన్న ఈ టెంట్ ని కొంచెం 3 పక్కల క్లోజ్ చేసి కొంత ఎండ, వాన నుంచి రక్షణ కల్పించే ఏర్పాటు చేసే పనిలో ఉన్నాం. 

➡️ 🤝 ఇదిలా ఉంటె... మొన్న సోమవారం నాడు Satyam, Extramile  అను రెండు స్వచ్చంద సంస్థలు షాదనగర్ లోని మన చైల్డ్ లెర్నింగ్ సెంటర్ (CLC) ని సందర్శించి 25 మంది పిల్లలకు, అలాగే ఆ కమ్యూనిటీలోని 20 మంది ఆడవారికి క్రింద తెలిపిన వస్తువులను పంపిణీ చేయడం జరిగింది.

1. పిల్లలకు చెప్పులు, డ్రాయింగ్ బుక్స్, క్రెయాన్స్, వాటర్ కలర్స్, కలర్ పెన్సిల్స్, చాక్లెట్స్, స్వీట్స్

2. ఆడవారికి 120 సానిటరీ పాడ్స్, ఇన్నర్ వేర్

3. 50కేజీ బియ్యం, 26 కేజీల గోధుమ పిండి, వాడిన దుస్తులు అందచేశారు.

🤼పిల్లలు ఈవెంట్ ని చాలా ఎంజాయ్ చేశారు, అలాగే ఆడవాళ్ళలో కూడా menstrual హైజీన్ గురించి కొంత అవగాహన కల్పించి, పాడ్స్ పంపిణీ చేశారు.... ఇందులో మానస (సత్యం), నాగ మోహన్ (Extramile) లతో పాటు అశ్వ నుంచి హరిత, శ్రీనివాస్ లు పాల్గొన్నారు. అంత దూరం నుంచి వచ్చి ఒక మంచి అవగాహన కార్యక్రమం నిర్వహించి, CLC లో పిల్లలతో, రిసోర్స్ పర్సన్ తో ముచ్చటించారు.  







#CLCASWA

#ammaaswa

#ASWAVIKAS

టీం అశ్వ

www.aswa4u.org

Fb.com/ammaaswa