అమ్మ స్వచ్చంద సేవా సమితి *13 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని, 14 వ సంవత్సరం లోకి అడగుపెడుతున్న సందర్భంగా* అశ్వ ఇన్ని సంవత్సరాలుగా వివిధరకాల సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో కొన్ని లక్షల మందికి చేరువై, వారికి తోడుగా నిలివడానికి కారణమైన కార్యకర్తలు, దాతలు, సలహా దారులు, తోడు నీడగా, అండగా నిలిచిన వారందరికి మా కృతజ్ఞతలు... మన పయనం ఇలాగే మరెంతోమంది జీవితాలలో సుఖ, శాంతులను కలుగ చెయ్యాలని కోరుకుంటూ.....
*అందరికి 13 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు...*
*ఈ సంవత్సరం (2020-21) CHDHC ద్వారా* ఒక 2700 మంది ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీను, 2600 విద్యార్థులను, 700 మంది టీచర్లను, 11 బ్యాచ్ ల ద్వారా 1000 మంది సాధారణ ప్రజలను అలాగే వివిధ రకాల అనుబంధ కార్యక్రమాల ద్వారా, దాదాపు 400 గంటలు వెచ్చించి, 10000 వేల మందికి జీవన విద్య తరగతులను నిర్వహించి, వారి జీవితాలలో మార్పు తేవడం కోసం ఎంతో ప్రయత్నం చేసింది. ఎంతో మంది ఈ జ్ఞానం ద్వారా తమ జీవితాలలో ముఖ్యంగా వ్యక్తిగతంగా ఏమి కావాలో, ఏమి చెయ్యాలో అనే స్పష్టత, భార్య-భర్త, పిల్లలతో, పెద్దవారితో, స్నేహితులు, సన్నిహితులతో, బయట వారితో తమ ప్రవర్తనలోను, సంబంధాలలోను సుస్పష్టమైన మార్పు గమనిస్తున్నామని చెప్పడం ఎంతో ఆనందకరమైన విషయం. *ముఖ్యంగా లాక్డౌన్ వలన అందరూ ఇళ్లలోనే వుంటూ, వారి మధ్య వచ్చే గొడవలను అర్ధంచేసుకొని, సరైన రీతిలో వ్యవహరించడానికి, పిల్లలను సరి అయిన పద్దతిలో పెంచడానికి చాలా దోహదం చేసింది.*
అందరి తల్లితండ్రుల సమస్య పిల్లల చదువు. దీనికోసం *పిల్లలు-పుస్తకాలు-కథలు-పిల్లల పెంపకం-గ్రంధాలయాలు* అనే శీర్షికన, సంబంధిత విషయాల పై *45 కి పైగా ఆన్లైన్ తరగతులను* నిర్వహించి ఎంతో మంది తల్లితండ్రులు, ఉపాధ్యాయులకు బాసటగా నిలిచింది.
అలాగే కరోనా సమయంలో *రక్తం/ప్లాస్మా/పేట్లెట్స్* కోసం వచ్చే కాల్స్ లో రోజు కనీసం ఇద్దరికి సాయం అందిస్తూ, అలాగే *3 రక్తదాన శిబిరాలను నిర్వహించి, 100 యూనిట్ల* రక్తాన్ని తలసీమియా వ్యాధుగ్రేస్తుల కోసం సేకరించింది.
పాఠశాలకు వెళ్లలేక, ఆన్లైన్ క్లాసెస్ హాజరయ్యే పరిస్థితి లెనప్పుడు, వారు చదువుకు ఎంత త్వరగా దూరమవుతారో మీకు తెలియంది కాదు. అలాంటి *25 మంది పేద పిల్లల కోసం షాదనగర్ లో చిల్డ్రన్ లెర్నింగ్ సెంటర్ (CLC)* మొదలుపెట్టి వివిధ రకాల ఆటలు, పాటలు, నూతన బోధనా పద్ధతుల ద్వారా వారిలో భాషాభివృద్ది, అక్షరాస్యత కోసం ప్రయత్నం చేస్తోంది.
అలాగే *6 మంది బీ.టెక్, డిప్లొమా విద్యార్థులకు* వారి కాలేజ్, హాస్టల్ ఫీ కి సాయం చేసి వారి విద్య ఆగకుండా కోనసాగడానికి సాయపడింది. వీరిలో ఒక అమ్మాయి ఈ మధ్యనే *33వేల జీతంతో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడం* ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
కోవిడ్ భూతంతో అతలాకుతలమైన జీవితాలలో *(207 కుటుంబాలకు) బియ్యం, ఇతర సరుకులను అందచేసి* సాయం అందించింది. వీరిలో దాదాపు 40 కుటుంబాలకు అండగా ఉండి తరచూ సాయం చేస్తోంది.
ఈ సంక్షోభ సమయంలో అందరూ కలసి కట్టుగా, జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.... మరొక్క సారి మీ, మన అందరికి 13 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు...
*ఇన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన అశ్వ కుటుంబ సభ్యులు, మూలస్తంభాలు అయిన అశ్వ కార్యకర్తలకు శత కోటి నమస్సులు.*
మీ అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org
www.chdhc.org
Fb.com/ammaaswa
Fb.com/chdhchyd
9948885111