ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Saturday, March 17, 2018

10 వ తరగతి తరువాత వున్న వివిధ రకాల అవకాశాలు - PDF


నమస్తే,

10 వ తరగతి తరువాత వున్న వివిధ రకాల అవకాశాలను వివరిస్తూ అమ్మ స్వచ్చంద సేవా సమితి (www.aswa.co.in) వారు ఒక బుక్లెట్ తయారు చేసి *2 రాష్ట్రాలలో దాదాపుగా 600 ప్రభుత్వ పాఠశాలలో 60000 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం మీకు తెలిసిన విషయమే.*

ఇంకా ఎక్కువ మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను చేరుకోవడం కోసం ఈరోజు ఇదే *బుక్లెట్ ను సభ్యులందరికి నూతన సంవత్సర (ఉగాది) కానుకగా PDF రూపంలో* అందించడం జరిగింది.

*ASWA 10 సంవత్సరాలుగా నెలకు 1 గంట సమయం లేదా 100/- ఆర్ధిక సహాయం చేస్తున్న కార్యకర్తలతోనే* పేద విద్యార్థుల చదువుకు ఆర్ధిక సాయం, రోగ గ్రస్థులకు మెడికల్ సపోర్ట్, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలో వారం వారం తరగతుల నిర్వహణ, ఆశ్రమాల సందర్శన-సాయం, ఫ్లడ్ రిలీఫ్ లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సంగతి మీకు తెలిసినదే.




*మీరు ఈ యజ్ఞంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను భాగస్వాములు కావొచ్చును. ASWA కు మీ సహాయ సహకారాలు అందించవచ్చును.*

మరిన్ని వివరాలకు

Facebook : AMMAASWA

Web : www.aswa.co.in

Mail : amma.aswa@gmail.com

Help line : Amma Sreenivas 9948885111 /Haritha 9949789229