ఈ రోజు చరిత కోసం మేము చేసిన ఒక చిన్న పని - దాని ప్రాముఖ్యత. దీనికయ్యే ఖర్చు ఒక మంచి తెగని (ప్లాస్టిక్ / ఏదైనా) గట్టి దారం.
పిల్లలకి ఎన్ని కథల పుస్తకాలు కొనిచ్చామో / కొనిస్తున్నామో ఒక ముఖ్యమైన విషయం అలాగే ఎన్ని వారికి అందుబాటులో ఉంచామో అనేది ఇంకా చాలా పెద్ద విషయం.
మన ఇంట్లో మనకోసం మనమే చాలా బుక్స్ కొనివుంటాము. ఎన్ని కొన్నామో కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి కొన్నవి/ మన ఇంట్లో వుండేవి మనకు కనపడేట్టు పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ప్రక్రియ...దీనిని లైబ్రరీ పరిభాషలో "ప్రదర్శన (DISPLAY)" అంటారు.
పిల్లల్లో (మనలో కూడా) పుస్తకాల మీద ఆశక్తిని పెంచడానికి వాటిని వివిధ రకాలుగా అమర్చాలి. దీనికి ఒక సులభమైన ఉదాహరణ DMART తదితర సూపర్ మార్కెట్లు. వినియోగదారులను ఆకర్షించడానికి వారు రోజుకో, వారానికో డిస్ప్లే మారుస్తూ వుంటారు. మనం కూడా అలానే మన పిల్లలకు రకరకాల పద్దతుల్లో display చెయ్యాలి. వారు వారికి ఇష్టం వచ్చినవి తీసి చదువుకొనే విధంగా అందుబాటులో ఉంచాలి.
స్కూల్ లో గానీ, ఇంటిలో కానీ, గ్రంధాలయాలలో కానీ ఇలా పుస్తకాలు కనపడకపోవడమే పెద్ద సమస్య. మీరు రకరకాల DISPLAY లు చాలా సులభంగా చెయ్యొచ్చు. ఆలోచించండి.....
పిల్లలు - చదువులు - కథలు - కథల పుస్తకాలు - గ్రంధాలయాలు గురించి నాకు తెలిసినవి - మీ అమ్మ శ్రీనివాస్, అమ్మ స్వచ్చంధ సేవా సమితి
మీ అమ్మ శ్రీనివాస్
www.aswa4u.org
www.chdhc.org
26.08.2020