ఈ రోజు (09.06.2019) శ్రీనివాస నగర్ (వెస్ట్) కమ్యూనిటీ హాల్, SR నగర్ నందు 33వ రక్త దాన శిబిరం నిర్వహించారు. ఇందులో 200 మందికి పైగా పాల్గొనగా, 120 మంది స్వచందంగా రక్త దానం చేసారు* 40 మందికి పైగా అశ్వ కార్యకర్తలు తమ కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టెక్ గురు, మోటివేషనల్ స్పీకర్ శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు కాంప్ ప్రారంభోత్సవం చెయ్యడమే కాక, రక్త దానం చేశారు. అలాగే రక్తదానం లోనే కాకుండా, విద్యార్థులకు తరగతులు, అన్నదానాలు లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తు, విశేష సేవ చేస్తున్న అశ్వని, వారి కార్యకర్తలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి 2000/- విరాళాలు ఇచ్చారు.*
*ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఈ కార్యక్రమాన్ని జీరో వేస్ట్ ఆక్టివిటీ గా చెయ్యాలనే ఆలోచనకు ఊతమిచి స్టీల్ ప్లేట్స్, గ్లాస్లు, అలాగే బ్లడ్ డోనర్స్ కి పండ్లు, డ్రింక్ స్పాన్సర్ చేశారు "మన్న ట్రస్ట్" వారు. ఆ సంస్థ తరపున స్రవంతి కాసరం, సోషియల్ ఆక్టివిటీస్ మేనేజర్ వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.* పాల్గొన్న అందరూ మన సేవా కార్యక్రమాలను కొనియడడమే కాకుండా, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేశారు.
*ఒక చిన్న ఆలోచనగా 2011 లో మొదలైన ఈ రక్త దాన శిబరాల నిర్వహణ ఈ రోజు నిర్విగ్నంగా 33 శిబరాలు చేరుకోవడం చాలా ఆనందంగా తృప్తిగా వుందని "సేవ్ లైఫ్ టీం సభ్యులు వెంకటేష్, బాలు మహేంద్ర, గణేష్, శివ, హిమ బిందు" తెలిపారు.*
"ఈ రోజు " వీటిలో "సేవ్ లైఫ్" (SAVE LIFE) అనే ప్రాజెక్ట్ లో ముక్యంగా తలసీమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం ASWA రక్త దాన శిబిరాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం చెస్తున్నరు. థలాసెమియా వ్యాధిగల పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించలి ఇందులో బాగంగా ప్రతి ఒక్కరు స్వచందంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్త దానం చెయ్యాలని అయన తెలిపరు. ఎవరైనా, ఎక్కడైనా రక్త దానం చెయ్యాలను, వారి కాలనీ /అపార్ట్ మెంట్/ఆఫీసు/హాస్టల్ లలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయ్యలనుకొంటే 9948885111/www.aswa.co.in సంప్రదించాలని విన్నమించారు.
అనిల్ & మహేష్
సేవ్ లైఫ్ ప్రాజెక్ట్ టీం లీడర్స్
అమ్మ స్వచ్చంద సేవా సమితి
అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ASWA) ఆధ్వర్యంలో ఈరోజు SR Nagar కమ్యూనిటీ హాల్‌లో తలసేమియా పేషెంట్ల కోసం జరిగిన 33వ బ్లడ్ డొనేషన్ క్యాంప్‌కి ముఖ్య అతిధిగా హాజరై, బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది. స్కూల్ విద్యార్థులకి సెషన్లు, అన్నదానం వంటి అనేక సేవా కార్యక్రమాలు ఆ సంస్థ నిర్వహిస్తోంది. దాని నిర్వాహకులు శ్రీనివాస్ గారికి, మహేష్ గారికి, అనిల్ గారు, ధనేష్ గారు ఇతర మిత్రులకి అభినందనలు.
- Nallamothu Sridhar
ASWA 3⃣3⃣ Blood Donation Camp Successful.
1⃣5⃣0⃣ Members participated and
1⃣1⃣3⃣ Donors Donated Blood.
Thank you so much everyone.🙏