ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Tuesday, May 01, 2018

ASWA వారి దశమ వార్షికోత్సవ పోటీలు - కథ, కవిత, వాస్తవిక సంఘటన - ఎవరైనా పాల్గొనవచ్చును

నమస్తే...

*ASWA వారి దశమ వార్షికోత్సవ పోటీలు - కథ, కవిత, వాస్తవిక సంఘటన - ఎవరైనా పాల్గొనవచ్చును*

మానవ సేవే మాధవ సేవగా నమ్మి, 27.04.2008 నుండి గత పదేళ్లుగా అనేక కార్యక్రమాల ద్వారా సమాజ సేవ చేస్తూ, పలువురికి ప్రేరణగా నిలుస్తున్న “ అమ్మ స్వచ్చంద సేవా సమితి (అశ్వ)” వారు రానున్న వారి దశమ వార్షికోత్సవం సందర్భంగా దిగువ విభాగాల్లో సాహితీ పోటీలు నిర్వహించదలచారు.

1. *కధ* - చదువరుల మనసుకి హత్తుకుని, సేవ చెయ్యాలన్న సంకల్పాన్ని వారి మనస్సులో కూడా నాటగల చక్కని అంశంతో కూడుకున్న కధలు ఈ పోటీకి పంపవచ్చు. కధ a4 సైజులో నాలుగు పేజీలు  మించకూడదు. కధతో పాటుగా మీ చిరునామా, ఫోన్ నెంబర్, హామీపత్రం కూడా తప్పనిసరిగా జోడించాలి.

2. *కవిత* - ప్రేరణాత్మకమైన మంచి కవితలను రాసి పంపవచ్చు. కవిత నిడివి 30 పంక్తులకు మించకుండా ఉండాలి. కవితతో పాటుగా మీ చిరునామా, ఫోన్ నెంబర్, హామీపత్రం కూడా తప్పనిసరిగా జోడించాలి.

3. *వాస్తవిక సంఘటన* - నిజ జీవితంలో ఒక్కోసారి అనుకోకుండా మనకు ఇతరులకు సహాయపడే/సేవ చేసే అవకాశం లభించినప్పుడు, వారి దీవెనలు, ఆశీర్వచనాలతో, చెప్పేందుకు భాష చాలనంత ఆత్మ తృప్తితో ఉప్పొంగిపోతాము. మీ నిజ జీవితంలో జరిగిన అటువంటి సన్నివేశాలను చిన్న వ్యాసంగా మాకు రాసి పంపండి. ఇతరులకు ప్రేరణ కలిగించండి. నిడివి a4 లో రెండు పేజీలకు మించకూడదు.  సంఘటనతో పాటుగా మీ చిరునామా, ఫోన్ నెంబర్, హామీపత్రం కూడా తప్పనిసరిగా జోడించాలి.

*మీ రచనలను పంపవలసిన ఆఖరు తేదీ –మే 10.*

Word డాక్యుమెంట్ గా మీ రచనలను పంపాలి. (Unicode –google input tools – Unicode fonts)

ఒకరు ఒక విభాగంలోనే రచనలను పంపాలి.

*రచనలను పంపాల్సిన ఈమెయిలు - Sub : 10th Anniversary Competition* amma.aswa@gmail.com

*ప్రతి విభాగంలోనూ మూడు బహుమతులు ఉంటాయి. బహుమతి పొందిన రచనలను ASWA వారి వార్షికోత్సవ సావనీర్లో ప్రచురిస్తారు. అంతే కాక, దశమ వార్షికోత్సవ సంబరాల్లో విజేతలందరికీ మా విశిష్ట అతిధులచే వేదికపై సత్కారం, జ్ఞాపికను  కూడా అందించడం జరుగుతుంది.*

ఇట్లు

అమ్మ స్వచ్చంద సేవా సమితి (అశ్వ)
Whatsapp : 9948885111
FB: AMMA ASWA
www.aswa.co.in