అమ్మ
స్వచ్ఛంద సేవా సమితి, ఎస్ ఆర్ నగర్, హైదరాబాదు వారు గత 8 సంవత్సరములుగా
పేద విద్యార్థులను చదివించడం; ప్రభుత్వ పాటశాలలో ప్రత్యేక తరగతులను
నిర్వహించడం; అనాధ, వృద్దా ఆశ్రమాలను సందర్శించి చేతనైన సయం చెయ్యడం;
ఆర్ధిక స్తోమత లేని వ్య్రదిగ్రస్తులకు సాయం చేయడం; ప్రకృతి విపత్తులలో
భాదితులను ఆదుకోవడం; పర్యావరణ పరిరక్షణకు సంబందించిన అవగాహనా కార్యక్రమాలు;
ఆకలితో అలమటించు వారికి అన్నదానాలు చెయ్యడంలాంటి ఎన్నో సేవ కార్యక్రమాలు
నిర్వహిస్తున్నారు.
ఈ
సంస్థలో పనిచేసే volunteers అందరు ఉద్యోగస్తులు, విద్యార్దులే, ఇతరులకు
సేవ చెయ్యడం సమాజ సేవ కాదు-ఇది మన భాద్యత అని నమ్మి నెలకి 1 గంట సమయాన్ని
కెతయిస్తున్నరు.
"ఈ రోజు " వీటిలో "సేవ్ లైఫ్" (SAVE LIFE) అనే ప్రాజెక్ట్ లో ముక్యంగా తలసీమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం రక్త దాన శిబిరాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం చెస్తున్నరు. ఇప్పటిదాకా
2
4
రక్త దాన శిబిరాలను నిర్వహించగా, కొన్ని వేల మంది రక్త దాతలు స్వచ్చందంగా పాల్గొని ఎంతో మంది చిన్నారులను ఆదుకున్నారు. థలాసెమియా వ్యాధిగల పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించలి
ఇందులో బాగంగా ఈ రోజు
(
04.12.2016)
SR Nagar community hall నందు 25 వ రక్త దాన శిబిరం (silver jubilee)
నిర్వహించారు. ఇందులో 350 మంది పాల్గొనగా, 250 మంది స్వచందంగా రక్త దానం
చేసారు అని ఆ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మహేష్ తెలిపరు. ప్రతి ఒక్కరు
స్వచందంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్త దానం చెయ్యాలని అయన తెలిపరు.
ఎవరైనా, ఎక్కడైనా రక్త దానం చెయ్యాలను, వారి కాలనీ /అపార్ట్
మెంట్/ఆఫీసు/ హాస్టల్ లలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయ్యలనుకొంటే
9666526698 / 9948885111/ www.aswa.co.in సంప్రదించాలని విన్నమించారు
ఒక చిన్న ఆలోచనగా
2011
లో మొదలైన ఈ రక్త దాన శిబరాల నిర్వహణ ఈ రోజు నిర్విగ్నంగా 25 శిబరాలు
చేరుకోవడం చాలా ఆనందంగా తృప్తిగా వుందని సంస్థ వ్యవస్తాపకుడు శ్రీనివాస్
తెలిపారు.
రక్త దానం పై అవగాహన కల్పించడం కోసం ఉదయం 10 నుంచి 12:00 దాక 20 మంది ఎస్ ఆర్ నగర్ లో రాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులు గా
- పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ (ఆంధ్ర పోరీ ఫేం)
- విజయ రామ రాజు,టీవీ ఆర్టిస్ట్
- రచ్చ రవి, టీవీ & మూవీ యాక్టర్
- జోష్ రవి, మూవీ యాక్టర్
- భరత్, టీవీ ఆర్టిస్ట్
- పవన్ సాయి, టీవీ ఆర్టిస్ట్
- ఉమా పద్మనాభన్, సోషల్ అక్తివిస్ట్
- నారాయణ రావు గారు, కమ్యూనిటీ హాల్ ప్రెసిడెంట్
- సుమన్ జైన్, తలస్సేమి సొసైటీ సెక్రటరీ
- రత్నావళి, తలస్సేమి సొసైటీఫౌండర్
- 40 మంది అశ్వ వాలంటీర్స్ పాల్గొన్నారు