ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Thursday, September 19, 2019

34th Blood Donation Camp on 15.09.2010 -150 Participated and 100 Donated


*ఈ రోజు (15.09.2019)  శ్రీనివాస నగర్ (వెస్ట్) కమ్యూనిటీ హాల్, SR నగర్ నందు 34వ రక్త దాన శిబిరం  నిర్వహించారు.  ఇందులో 150 మందికి పైగా పాల్గొనగా, 100 మంది స్వచందంగా రక్త దానం చేసారు* 40 మందికి పైగా అశ్వ కార్యకర్తలు తమ కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. 

 

*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కమెడియన్, జబర్దస్త్ ఫేం శ్రీ రాకెట్ రాఘవ గారు కాంప్ ప్రారంభోత్సవం చెయ్యడమే కాక10,000/- విరాళంగ ఇచ్చారు. అలాగే  రక్తదానం లోనే కాకుండావిద్యార్థులకు తరగతులుఅన్నదానాలు లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తు,  విశేష సేవ చేస్తున్న  అశ్వనివారి కార్యకర్తలను రాకెట్ రాఘవ కొనియాడారు. అందరు నెలకు 1 గంట సమయాన్ని ఇచ్చి సంస్థకు తోడ్పాటు ఇవ్వాలని కోరారు*

 

*ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఈ కార్యక్రమాన్ని జీరో వేస్ట్ ఆక్టివిటీ గా చెయ్యాలనే ఆలోచనకు ఊతమిచి EMIDS Corporate కంపెనీ వారు దాతలకు ఎనర్జీ డ్రింక్, వొలుంటీర్స్ కి క్లాత్ బాగ్స్ అందచేసారు. పాల్గొన్న అందరూ మన సేవా కార్యక్రమాలను కొనియడడమే కాకుండాతమ వంతు  సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేశారు.

 

*ఒక చిన్న ఆలోచనగా 2011 లో మొదలైన ఈ రక్త దాన శిబరాల నిర్వహణ ఈ రోజు నిర్విగ్నంగా 34 శిబరాలు చేరుకోవడం చాలా ఆనందంగా తృప్తిగా వుందని "సేవ్ లైఫ్ టీం సభ్యులు ఫణి, గణేష్, మునీర్, వెంకటేష్బాలు మహేంద్రశివహిమ బిందు" తెలిపారు.*

 

"ఈ రోజు " వీటిలో "సేవ్ లైఫ్" (SAVE  LIFE) అనే ప్రాజెక్ట్ లో ముక్యంగా తలసీమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం ASWA రక్త దాన శిబిరాలనుఅవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం చెస్తున్నరు. థలాసెమియా వ్యాధిగల పిల్లలకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించలి ఇందులో బాగంగా ప్రతి ఒక్కరు స్వచందంగా ప్రతి నెలలకు ఒకసారి రక్త దానం చెయ్యాలని అయన తెలిపరు. ఎవరైనాఎక్కడైనా రక్త దానం చెయ్యాలనువారి కాలనీ /అపార్ట్ మెంట్/ఆఫీసు/హాస్టల్ లలో రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయ్యలనుకొంటే 9948885111 / www.aswa.org సంప్రదించాలని విన్నమించారు.

 

అనిల్ & మహేష్

సేవ్ లైఫ్ ప్రాజెక్ట్ టీం లీడర్స్

అమ్మ స్వచ్చంద సేవా సమితి (ASWA)