ఈ సంస్థ ఎటువంటి (మతపరమైనటువంటి) ఇతర సంస్థలకు సంబంధించింది కానీ, అనుబంధమైనది కానీ కాదు. ఇది పూర్తిగా స్వచ్చంద సేవకోసం స్థాపించబడినది......

Thursday, January 12, 2017

అశ్వ అంతరార్ధం

మీరు అమ్మ స్వచ్చంద సేవా సమితి కార్యక్రమాల్లో దాదాపుగ చాల కాలం నుంచి పాల్గొంటున్నారు. మీకు అశ్వ అంతరార్ధం అర్ధమయ్యి వుండే ఉంటుంది.

అదేంటంటే *"సమాజాన్ని మనం అందరం కలిసి మార్చాలి, ఒక మంచి వసుదైక కుటుంబంగా ప్రతి ఒక్కరూ తోటి వారిని ప్రేమిస్తూ, సేవిస్తూ జీవించాలని. ఇందులో పేరు ప్రస్తావన లేదు, కీర్తి ప్రతిష్ఠల ప్రస్తావన అంతకంటే లేదు. మనిషిగా పుట్టినందుకు మనం చెయ్యాల్సిన, నెరవేర్చాల్సిన కనీస బాధ్యత....*

దీని కోసం ఈ యజ్ఞంలో నాతో మీరు చెయ్యి కలిపినందుకు ఎంతో సంతోషం. కానీ ఇది సరిపోదు కదా.. *మనం చేసే మంచి పని మనతో పాటు ఆగిపోకూడదు కదా? కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని ఈ యజ్ఞంలో పాలుపంచుకొనేలా చేద్దామా?*

*కావున మీ భావలనో, అనుభవాలనో పంచుకుంటూ మనం చేస్తున్న అశ్వ కార్యక్రమాల వివరాలను మీ తోటి వారితోను, మీ ముఖ పుస్తకాల మీద, వాట్సాప్లోను పంచుకోవడం ద్వారా ఎంతో మందికి సేవా మార్గాన్ని చూపించే అవకాశం మీ చేతుల్లో వుంది కదా*

మన వివరాలు

కొత్తగా అశ్వలో చేరటానికి మీ వివరాలు ఇందులో నమోదు చేసుకోండి. *మీరు నెలకు ఒక గంట సమయం ఇవ్వడం ద్వారా ఇందులో సభ్యులు కావొచ్చును. మీకు నచ్చితే, వీలైతే ఆర్ధిక సాయం కూడా చెయ్యవచ్చును*


  • ఆలోచన బానే వుందా... మరి ఇంకెందుకు ఆలస్యం ఆచరణలో పెడదామా???* 
  • ఒక్క విత్తనంతో అడవిని సృష్టించగలం...

  • ఒక్క దీపంతో చుట్టూరా కాంతిని నింపగలం, చీకటిని తరిమెయ్యగలం...
అలాంటిది మీ ఒక్కరి అడుగుతో కొంత మంది సేవా భావం కలిగిన కార్యకర్తలను ఈ దేశానికి ఇవ్వగలం....

తెలుసుగా... *సేవ చేయడానికి మన జీతం మొత్తన్నో, జీవితం మొత్తన్నో త్యాగం చెయ్యనక్కరలేదు, నీకు చెయ్యాలనే బలమైన తలంపు (సంకల్పం) చాలు అవకాశాలను సృష్టించడానికి, అవరోధాలను తొలగించడానికి....*

నా ఈ ఆలోచన/లక్ష్యం  కోసం మీరు నాతో చెయ్యకలపకండి...

నా ఈ ఆలోచన/లక్ష్యం మీకు నచ్చితే, ఇద్దరం / అందరం కలిసి మన ఆలోచన/లక్ష్యం కోసం ఇష్టంగా పనిచేద్దాం...

మీ అమ్మ శ్రీనివాస్
www.aswa.co.in