మా తాత గారికి బ్లడ్ అవసరమైనప్పుడు రేర్ గ్రూప్ అవ్వటం వల్ల బాగా కంగారుపడ్డాం.
ఫ్రెండ్స్ ని , రెలాటివ్స్ ని సాయం అడిగాను , కనుక్కుని చెప్తామన్నారు.
తెలిసిన కొంతమంది డోనొర్స్ ని అడిగితే, ఎవ్వరు దొరకకపోతే మేము ఇస్తాము మాది లాస్ట్ ఆప్షన్ గా అనుకోండి అని చెప్పారు.
అందరూ లాస్ట్ ఆప్షన్ అంటున్నారు, కచ్చితంగా నేను ఇస్తాను అని ఎవ్వరు చెప్పటంలేదు.
అలాంటి టైం లో నాకు ఎవరో ఫోన్ చేశారు, *ASWA BLOOD DONORS గ్రూప్ లో బ్లడ్ గురించి చేసిన పోస్ట్ చూసి చేస్తున్నాను అని చెప్పారు.*
తర్వాత రోజు మీరు 2-3 సార్లు ఫోన్ చేసి కనుకున్నారు. అదే రోజు ఎవరో ఫోన్ చేసి డోనార్ నెంబర్ ఇచ్చారు, వాళ్లని అడగగానే డొనేట్ చేస్తామని చెప్పారు.
టెన్షన్ తగ్గింది.
మీరు చేసిన సపోర్ట్ నేను మర్చిపోలేను.
మాకు తెలిసిన వాళ్లు లాస్ట్ ప్రయారిటీ అంటుంటే, మేము ఎవరో కూడా తెలియని వాళ్లు మాటలతో ధైర్యం చెప్పటం, అడగగానే ఆలోచించకుండా డొనేట్ చేస్తానాని చెప్పటం
నిజంగా చాలా ఎమోషనల్ గా అనిపించింది అప్పుడు.
నేనె మీ సిట్యుయేషన్ లో ఉండిఉంటే జస్ట్ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి ఉండేవాడిని, మళ్ళీ ఏమైందో , డోనొర్స్ దొరికారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేసేవాడిని కాదేమో.
కొన్ని రోజుల తర్వాత
ఒక రోజు నేను మా ఆఫీస్ లో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది, ఏదో యాప్ లో మీ నెంబర్ చూసి ఫోన్ చెస్తూన్నాము, బ్లడ్ డొనేట్ చేస్తారా అని.
చేస్తానని చెప్పా.
మా ఆఫీస్ దగ్గర ఉన్న హాస్పిటల్ అని చెప్పారు. ఆఫీస్ లో పెర్మిషన్ తీసుకుని వెంటనే వెళ్ళాను.
కానీ బ్లడ్ బ్యాంక్ ఉదయం7-సాయంత్రం7 మాత్రమే ఉంటుంది , తర్వాత రోజు రమ్మని చెప్పారు బ్లడ్ బ్యాంక్ వాళ్లు.
పేషెంట్ వాళ్ళ నాన్న కి ఈ విషయం తెలియక పిలిచారు.
అతనిని వివరాలు ఆడిగితే తెలిసింది బ్లడ్ ఒక పాప హార్ట్ ఆపరేషన్కి. ఆ పాప నికి హార్ట్ లో హోల్ ఉందంట.
నాలాగే వచ్చిన డోనార్స్ వెళ్లిపోయారు.
మా ఆఫీస్ హాస్పిటల్ దగ్గరే మీరు ఎప్పుడు అవసరం అయినా ఫోన్ చేయండి , ఆఫీస్ లో చాలామంది డోనొర్స్ ఉంటారు, వస్తాము అని చెప్పి వచ్చేశాను.
ఒక వారం తరువాత అతను ఫోన్ చేశారు బ్లడ్ డోనొర్స్ కావాలి అని.
మా ఆఫీస్ లో అనౌన్స్ చేయించి డోనొర్స్ ని తీసుకుని వెళ్లి డొనేట్ చేసి వచ్చాము.
అక్కడినుంచి వచ్చేటప్పుడు ఆ పాప వాళ్ళ నాన్న కళ్ళ నీళ్లు పెట్టుకుని మీ సాయం ఎప్పటికి మర్చిపోలేము సార్ అని అన్నారు.
పర్లేదండి పాప ని జాగ్రతగా చూసుకోండి, ఎవరికైనా ఇలా అవసరం ఉన్నపుడు సాయం చేయగలిగితే చేయండి చాలు అని చెప్పాను.
మీ నెంబర్ ఉంది సార్, అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాము అన్నారు.
సరే అని చెప్పి వచ్చేసాము.
నేను మా తాత గారికి అవసరం అయినప్పుడు మేము పొందిన సాయం , ఎమోషన్ అతని కళ్ళలో చూశాను.
పాప కి ఆపరేషన్ అయిన తరువాత ఒక సారి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడు ఒకసారి అతను ఫోన్ చేసి చెప్పారు.
నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
ఈ హ్యాపీనెస్ కి
నాకు స్ఫూర్తినిచ్చిన మీరు, మా తాత గారికి డొనేట్ చేసిన డొనర్స్,
నాకు ఆఫీస్ టైమ్ లో పెర్మిషన్ ఇచ్చిన మా మేనేజర్,
నేను అడగగానే వచ్చి డొనేట్ చేసిన మా కోలీగ్స్ కారణాలు.
సో నేను మీకు బాకీ ఉన్న థాంక్స్ కి బాక్ గ్రౌండ్ స్టోరీ ఇదే.
Thank you so much.
Your helping nature is a great inspiration.
Keep it up.
Little bit lengthy post
But read it once.
One of the active member in our blood donors group got this thanking msg from beneficiary...
After getting benefited from US, beneficiary became a donor.